![]() |
![]() |
.webp)
బుల్లితెరపై ఆడియన్స్ ని అలరిస్తున్న ఫేమస్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం చిన్నారుల డ్రామా జూనియర్స్ సీజన్-9 . సరికొత్త స్కిట్స్ తో ఈ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ప్రోమోలో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతోంది . స్కిట్ లో భాగంగా ఓ చిన్నారి అట్టపెట్టెతో చేసిన ఒక హెలికాప్టర్ మోడల్‌ను తీసుకురాగా, అందులో ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నట్లు నటించారు. దీంతో పిల్లలు జడ్జీలపై వరుస పంచ్‌లు వేస్తూ సందడి చేశారు. "అది కాకి కాదు... సుధీర్" అంటూ ఓ చిన్నారి వేసిన డైలాగ్ అందరినీ నవ్వుల్లో ముంచింది.
.webp)
ఇంకో చిన్నారి ఐతే విమానాన్ని పట్టుకుని "ఎంత ఎండాకాలమైతే మాత్రం ఇంత పెద్ద ఫ్యాన్ తెస్తావా" అంటూ చెప్పిన డైలాగ్ కి రోజా నవ్వేశారు. జడ్జి శ్రీకాంత్ గారి ఇంటి మీద ఇన్ని బట్టలు ఆరేసి ఉన్నాయేంటీరా అని మరో చిన్నారి అనేసరికి "అవి ఉతకడం వల్లే కదా ఉదయం సెట్‌కి లేట్ గా వచ్చారు " అని పంచ్ వేయగా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అనిల్ రావిపూడి ఇంటి ముందు "చుక్కల ముగ్గు ఎంత బాగుందో " అని ఇంకో చిన్నారి అనేసరికి "వచ్చానంటే ఆ ఫ్యాన్ రెక్కలిరిసేత్తాను" అన్నారు. ఇక సుధీర్ పైలెట్ అవతారం ఎత్తాడు. సుధీర్ కామెడీ హైలెట్ గా నిలిచింది. హెలికాప్టర్‌ను షేర్ ఆటోలా మార్చేసి అందులో అనిల్ రావిపూడి, శ్రీకాంత్, ధన్య బాలకృష్ణను కస్టమర్లుగా ఎక్కించుకుంటాడు. హార్న్, హ్యాండిల్, డ్రైవింగ్ స్టైల్ అన్నీ షేర్ ఆటోను గుర్తు చేసేలా ఉండటంతో జడ్జీలు నవ్వులు ఆపుకోలేకపోయారు."కాస్త స్టార్టింగ్ ట్రబుల్... మీరు దిగి తోయండి" అని శ్రీకాంత్‌ను అడిగాడు , "నేను తోయాలా?" అని ఆయన ఆశ్చర్యపోయారు . వెంటనే "ఖడ్గం సినిమాలో హెలికాప్టర్‌ను తాడుతో లాక్కెళ్లారు.. ఇప్పుడు కాస్త తోయలేరా?" అని సుధీర్ ఇచ్చిన కౌంటర్‌తో సెట్లో నవ్వుల వెల్లువ ఎగిసిపడింది.ఇక "గేట్ పడింది.. ట్రైన్ వెళ్లాక పోదాం", "ఇది ఆటో పైలెట్ సార్" అంటూ సుధీర్ వరుసగా పేల్చిన పంచ్‌లకు జడ్జీలు పగలబడి నవ్వేశారు. చివరికి "అనవసరంగా షోకి ఒప్పుకున్నా.. ఆపేయండయ్యా, నేను కిందకు దిగేసి వెళ్తాను" అంటూ శ్రీకాంత్ సరదాగా చెప్పడం ప్రోమోకు ఆకర్షణగా నిలిచింది.
![]() |
![]() |